

జనం న్యూస్ ; 10 ఏప్రిల్ వారం ;జనంని సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి ;వై రమేష్ ;సిద్దిపేట:
సిద్దిపేట: ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), సిద్దిపేట హిస్టరీ విభాగం ఆధ్వర్యంలో వర్ధమాన మహావీరుని జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమక్షంలో ఆయన జీవిత చరిత్ర, ఆధ్యాత్మిక బోధనలపై చర్చించబడింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హిస్టరీ విభాగాధిపతి డా. శ్రద్ధానందం మాట్లాడుతూ, క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దంలో సమాజంలో చోటు చేసుకున్న ఆర్థిక అసమానతలు, సాంఘిక దురాచారాలను నిర్మూలించేందుకు మహావీరుని బోధనలు ఎంతగానో తోడ్పడ్డాయని వివరించారు. అప్పటి యజ్ఞయాగాదుల వల్ల సామాన్య ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నలిగిపోయారని పేర్కొన్నారు. సీనియర్ అధ్యాపకులు ఆరు నాగేశ్వరరావు వర్ధమాన మహావీరుని గొప్పతనాన్ని వివరించారు. మరోవైపు, హిస్టరీ లెక్చరర్ డా. మామిడి కొండనుండి మాట్లాడుతూ, వేదానంతర యుగంలో జరిగిన జంతు-నర బలులు, బ్రాహ్మణాధిపత్యం వల్ల సామాన్య ప్రజలు ఎదుర్కొన్న కష్టాలను వివరించారు. అలాంటి సమయంలో మహావీరుని బోధనలు ప్రజలకు మార్గదర్శనంగా నిలిచాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిక్షపతి గణేష్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
