Listen to this article

జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సుంకరి రమేష్..

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..

గురువారం నాడు జమ్మికుంటలో 7వ,8వ వార్డులలో ఏఐసీసీ,టీపీసీసీఅధ్యక్షులపిలుపుమేరకు హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ ఆదేశానుసారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్,రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర లో భాగంగా పట్టణంలోని 7,8 వవార్డులలో పాదయాత్ర చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ…భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా జై బాపు జై భీమ్. జై సంవిధాన్ . అనే కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్‌ను అవమానిస్తూ, రాజ్యాంగాన్ని కించపరిచేలా బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏవిధంగా వ్యవహరిస్తున్నాయో, ప్రజలకు తెలియజేయడానికే ఈ కార్యక్రమం చేపట్టాం అని తెలిపారు.ప్రతి వాడవాడలో ఇంటింటికి మన రాజ్యాంగ అవశ్యకతను తెలుపుతూ, మహాత్మా గాంధీ,అంబేద్కర్, రాజ్యాంగాన్ని , చేత పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరకంగా నిరసనలు తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం అని అన్నారు,గాంధేయ మార్గంలో ఊరురా పాదయాత్ర లో జాతీయ జెండా తో మహాత్మా గాంధీ చిత్ర పటం అంబేద్కర్ చిత్రపటం భారత రాజ్యాంగం ప్రదర్శించి నిరసన వ్యక్తం చేస్తున్నాం అని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొనగంటి మల్లయ్య, దేశినికోటి, ఇంచార్జ్ అశోక్ రావు, కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు పూదారి రేణుక శివ,శ్రీపతి నరేష్, సారంగం, సాయిని రవి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు