

జనం న్యూస్ // ఏప్రిల్ // 10 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
ఏఐసిసి పిలుపు మేరకు హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు జమ్మికుంట మండలం పరిధిలోని, సైదాబాద్ గ్రామంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ రాష్ట్రీయ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర జమ్మికుంట మండల అధ్యక్షుడు వీరమనేని పరుశురాం రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సత్యం అహింస మార్గాల ద్వారా మహాత్మా గాంధీ, బ్రిటిష్ పాలన పై పోరాడి స్వాతంత్రం తీసుకువచ్చారన్నారు.మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన, బిజెపి పార్టీ వారు చేసిన వ్యాఖ్యలు అహంకార ధోరణిగా పరిగణిస్తూ, రాజ్యాంగాన్ని మారిస్తే మన హక్కులు మన స్వేచ్ఛ స్వాతంత్రాలను రద్దు చేసినట్టే అని దీనికి స్పందించాల్సిన అవసరం భారతదేశ ప్రతి పౌరుడుకి అవసరం అది మన బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. మనకి మాట్లాడే హక్కు చదువుకునే హక్కు భావాలని వ్యక్తపరిచే హక్కులని, బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులని నిర్వీర్యం చేయడానికి చూస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా, రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర గ్రామ గ్రామాలలో వాడవాడల నిర్వహిస్తూ రాజ్యాంగ ఫలాలు ప్రతి పౌరుడికి అందాలంటే దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గూడెం సారంగపాణి, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొర్లపల్లి నాగరాజు,ఏ్స్. ఎంపీటీసీ వాసాల రామస్వామి, అన్నం ప్రవీణ్, యూత్ కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పింగిలి రాకేష్, గ్రామ శాఖ అధ్యక్షులు ఉయ్యాల సతీష్, సాగర్ల మహేష్ కొలుగూరి శ్రీనివాస్ గాజుల సతీష్ కరట్లపల్లి శ్రీనివాస్ తాళ్ల శ్రావణ్,భోగం ప్రశాంత్ రాచపల్లి సురేష్ దొంగల భాస్కర్, ఇటుకల గణేష్, శరత్