Listen to this article

. జనం న్యూస్ 10 ఏప్రిల్ గురువారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి:వై.రమేష్;

మాజీ మంత్రివర్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు టు బిహెచ్కె కాలనీలో ప్రజల సంక్షేమం దృష్ట్యా నూతనంగా నిర్మించబోతున్న ప్రసన్నాంజనేయ స్వామి గుడి వద్ద బోర్ ఏర్పాటుకు ప్రత్యేకంగా స్పందించారు. కాలనీ వాసుల అభ్యర్థన మేరకు వెంటనే బోర్ పనులకు అనుమతి మంజూరు చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రాజనర్స్ పాల సాయిరాం మున్సిపల్ కమిషనర్ , ఎ ఈ గారు, అలాగే కేసీఆర్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి గుడి అధ్యక్షులు బాపు రెడ్డి కమిటీ సభ్యులు మరియు కాలనీ వాసులందరూ ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు తమ తోడ్పాటును అందించారు.