

జనం న్యూస్ 11 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
బీహార్ నుంచి అక్రమంగా తరలిస్తున్న విదేశీ సిగరెట్లను విజిలెన్స్ అధికారులు అయినాడ వద్ద స్వాధీనం చేసుకున్నారు. గురువారం డెంకాడ మండలం అయినాడ వద్ద విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. కోటి రూ1.70 కోట్ల విలువ చేసే మూడు లక్షల పదిహేను వేల బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు