Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 11. సంగారెడ్డి జిల్లా. పటాన్చెరు.

పటాన్చెరు రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలోని గాజుల బాబు చౌరస్తా మెయిన్ షాపింగ్ సెంటర్ వద్ద విద్యుత్ తీగలు డైమేజ్ కారణంగా లోవోల్టేజ్ సమస్యతో చాలా రోజుల నుండి విద్యుత్ అంతరాయం కలిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని. పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏకే. ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్.షేక్ అబ్దుల్ ఘనీ విద్యుత్ అధికారులు ఏఈ, ఏడి, డిఈ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వెంటనే స్పందించిన విద్యుత్ అధికారులు విద్యుత్ స్తంభాలకు ఉన్న పాత వైర్లను తీసేసి కొత్త వైర్లను అమర్చడం జరిగింది. ఎన్నో రోజుల విద్యుత్ సమస్యను పరిష్కరించిన అధికారులకు ఈ సందర్భంగా ఏకే. ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబ్దుల్ ఖదీర్ కృతజ్ఞతలు తెలిపారు.