Listen to this article

జనం న్యూస్. ఏప్రిల్ 10. సంగారెడ్డి జిల్లా. హత్నూర. కాంసెన్సీ ఇంచార్జ్.(అబ్దుల్ రహమాన్)

హత్నూర మండల వ్యాప్తంగా గురువారంనాడు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.ఈదురుగాలుల ప్రభావంతొ రహదారిపై చెట్లు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడగా పలు గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దౌల్తాబాద్ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద గత కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ కటౌట్ ఈదురుగాలులకు విరిగి అక్కడే నిలిపి ఉన్న ఆటోపై పడింది.అదే సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడం వలన త్రుటిలో పెను ప్రమాదంతప్పింది.