Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

సంఘ సంస్కర్త సత్యశోధక సమాజ స్థాపకుడు జ్యోతిరావు పూలే 198వ జయంతి పురస్కరించుకొని అనకాపల్లి పార్లమెంట్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మాజీ శాసనమండలి సభ్యులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పుష్పమాల అలంకరించి ఘనమైన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తాతయ్య బాబు నాగ జగదీష్ మాట్లాడుతూ పూలే సమాజంలో జరుగుతున్న అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు విశేషమైన కృషి చేశారని, దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందడానికి సత్యశోధక సమాజ్ ను ఏర్పాటు చేశారని, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, సంఘములో అన్ని మతాలు కులాలు ప్రజలు చేరవచ్చని పిలుపునిచ్చారని, దేశంలోనే తొలి బాలికా పాఠశాలను ప్రారంభించిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే ఆశయ సాధన కోసం నిరంతరం అన్ని వర్గాల ప్రజలు కృషిచేయాలని నాగ జగదీష్ అన్నారు. ఈ కార్యక్రమంలో భోగలింగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కాండ్రేగుల సత్యనారాయణ కుప్పిలి జగన్ మల్ల గణేష్ సాలాపు నాయుడు బోడి వెంకటరావు బుద్ధ భువనేశ్వరరావు యలమంచిలి బంగారు రాజు దాడి వేణు వేగి వెంకటరావు విల్లూరి రమణబాబు కొణతాల బాల తదితరులు పాల్గొన్నారు.//