

జనం న్యూస్ ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలి మహాత్మా జ్యోతిరావుపూలే 198 వ జయంతిని పురస్కరించుకొని కొత్తపేట మండల అద్యక్షులు సంపత్తి కనకేశ్వర్రావు ఆద్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర కార్యవర్గసభ్యులు పాలూరి దత్యానందం పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాలూరి మాట్లాడుతూ భారతీయ సామాజిక కార్యకర్త,కులవ్యతిరేక సంఘసంస్కర్త,రచయిత పూలే బడుగు బలహీన వర్గాల కొరకు వారి కృషి అమోఘమని,అణగారిన కులప్రజలకు విద్యను అందించారని,దిగువకులాల ప్రజలకు సమానహక్కులు పొందేందుకు సత్యశోదక్ సమాజ్ ను స్దాపించారని,మహిళా విద్యకు మార్గదర్శకులు,అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిచేసారని అన్నారు.1988లో మహాత్మా బిరుదాంకితులయ్యారని పేదలకోసం వారి దంపతుల కృషి అమోఘమని కొనియాడారు.ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సబ్యులు మద్దింశెట్టి శ్రీనువాస్,ఆర్ ఎస్ ఎస్ ఖండప్రముఖ్ తురగా ఆంజనే యులు,మండల ఉపాద్యక్షులు బిళ్ల పరంశెట్టి,బల్లా మూలాస్వామి,పాలాటి మాధవస్వామి,నల్లా శ్రీరామ్,కడుపూడి దావీదురాజు,అన్యం సత్యనారాయణ, పెన్నాడ నారాయణరావు, కిరణ్ నాయుడు, బుర్రా ఆంజనేయులు అజ్జవరపు సత్యనారాయణ, బండారు రామచంద్రరావు, ఇసికబట్ల వేంకటేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు.
