

జనం న్యూస్ // ఏప్రిల్ // 11 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
బహుజన సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దాసరపు మహేందర్ ఆధ్వర్యంలో, జమ్మికుంట గాంధీ చౌరస్తా వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాల వేసి, 198వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇ సందర్బంగా మహేందర్ మాట్లాడుతూ..జ్యోతిబాపూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్ర, పూణేలో జన్మించడం జరిగింది అన్నారు. పూలే సేవలను గుర్తు చేసారు. మహిళలను చాలా నీచంగా చాలా చిన్న చూపుగా చూస్తున్న సమయంలో మహిళలకు విద్య అవసరం లేదు అన్న సమయంలో, పూలే సతీమణి సావిత్రిబాయి పూలే కి విద్యను నేర్పించరన్నారు. తన ద్వారా దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల కోసం స్కూలు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే, అని తెలిపారు. దళిత సమాజానికి కూడా విద్యను దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పినటువంటి మహాత్మ జ్యోతిబాపూలే, అని వివరించారు. ఇలా ప్రతి ఒక్కరు అతని యొక్క సేవలను గుర్తు చేసుకోవలసిందిగా మనవి చేస్తున్న అన్నారు. జమ్మికుంట పట్టణ ప్రజలందరికీ మహాత్మా జ్యోతిబాపూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఇ కార్యక్రమం లో రాష్ట్ర కార్యదర్శి దొడ్డే సమ్మయ్య, జోనల్ కోఆర్డినేటర్ మారేపల్లి మొగిలయ్య, మరియు జిల్లా సభ్యులు ఈదునూరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.