

జనం న్యూస్ :11 ఏప్రిల్ శుక్రవారం: సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; వై.రమేష్ ;
మాచిరాజు బాల సాహిత్యం పీఠం వారు ప్రతిష్టాత్మకంగా జాతీయస్థాయిలో నిర్వహించిన బాలల కథల పోటీ 2025 లో సిద్దిపేట జిల్లాకు చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాలలో 9వ తరగతి చదువుతున్న జక్కుల లోహితకు ప్రథమ బహుమతి లభించింది. జాతీయ స్థాయిలో పోటీకి 541 కథల్లో లోహిత రాసిన ధూమపానం కథ ప్రథమ స్థానంలో నిలిచి జాతీయస్థాయిలో సిద్దిపేట జిల్లా మారుమ్రోగేలా చేసింది. కథలు వ్రాయడం ద్వారా పిల్లల్లో సృజనాత్మకత శక్తి పెంపొందుతుందని ప్రధానోపాధ్యాయులు గారన్నారు.
ఈ సందర్భంగా లోహితకు ప్రధానోపాధ్యాయులు డి.నాగేందర్ రెడ్డి,పూర్ణచందర్ రావు, అనిల్ కుమార్, సుహాసిని, శ్రీశైలం,రమాదేవి, లక్ష్మయ్య, సునీత ,ఆగయ్య, శ్రీనివాస్ ,ఆంజనేయులు,సరితఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించారు.ఈ అమ్మాయిని కథలు రాయడంలో ప్రోత్సహించిన
వరుకోలు లక్ష్మయ్య తెలుగు భాషోపాధ్యాయులు గారికి, మాచిరాజు బాలసాహిత్య కళాపీఠం వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తల్లి దండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ సాహిత్య పరిషత్ సిద్ధిపేట,శ్రీ వాణి సాహిత్య పరిషత్, సుగుణ సాహితి సమితి సంస్థలు వారు అభినందనలు తెలిపారు.