

బిజెపి కుటుంబ మరియు కుల పార్టీ కాదు బలమైన క్యాడర్ ఉన్న పార్టీ – వడ్డేపల్లి రాజేశ్వరరావు.
జనం న్యూస్ ఏప్రిల్ 11 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
భారతీయ జనతా పార్టీ నలబై ఐదవ స్థాపన దివస్ వేడుకలు ఫతేనగర్ డివిజన్ బిజెపి సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో గౌతం నగర్ నందు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని కార్యకర్తలు అందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, గౌతమ్ నగర్ భూత్ అధ్యక్షుడు రాదేశ్యామ్ పార్టీ జెండా ఆవిష్కరించరు, భారతీయ జనతా పార్టీ కుటుంబం మరియు కూల పార్టీ కాదని జాతీయత మరియు జాతీయ సమైక్యత భావం కలిగిన పార్టీఅని భారత్ మాతాకీ జై భారత్ అంటే మన దేశ భూమి అని మాతాకీ జై అంటే మన వారసత్వ సంపద మరియు సంస్కృతికీ జై అని భావిస్తూ దేశం పట్ల అంకిత భావం కలిగినటువంటి కార్యకర్తలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అని, భారత్ మాతాకీ జై అనే నినాదంతో దేశంలోని అన్ని వర్గాల ప్రజలను సంరక్షిస్తూ వారి అభ్యున్నతికి పాటుపడుతున్న పార్టీ బిజెపి మాత్రమేనాని రాజేశ్వరరావు తెలియజేశారు.అనంతరం సంఘసంస్కర్త జ్యోతిరావు పూలే గారి 198’వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాదగిరి బాలేష్ రఘు సురేష్ అశోక్ శివ గోపాల్ ఉషారాణి బేతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.