Listen to this article

జనం న్యూస్- ఏప్రిల్ 12- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీలో మహారాజుల సేవా సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి, మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి బహుజన చైతన్య మహిళల విద్య కోసం విశేష కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు, సమాజంలో అంటరానితనం కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిలోద్ధారానాకు కృషిచేసి దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులను పొందటానికి సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి జ్యోతిరావు పూలే అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మహారాజుల సేవా సంఘం నాయకులు జి భద్రయ్య, కే పుల్లారావు, నకులరావు, వీరబాబు మరియు అప్నా బజార్ వెంకట్, నాగార్జున ( చిరు), రమణ తదితరులు పాల్గొన్నారు.