

జనం న్యూస్, ఏప్రిల్ 12 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ మలుగు విజయ్ కుమార్)
సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకట్, హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కుల వెంకట్,మాట్లాడుతూ మహాత్మ పూలే ఆశయాల పునాదుల మీద బహుజన్ సమాజ్ పార్టీ నడుస్తుందని, ఆయన ఆశయాలు నెరవేర్చడంలో బహుజన్ సమాజ్ పార్టీ ఎప్పటికీ ముందుంటుందని, బెహేన్ మాయావతి నాయకత్వంలో బహుజనులకు బీఎస్పీ ఎప్పటికీ రక్షణగా ఉంటుందన్నారు. బహుజనుల శ్రేయస్సు కొరకు మహనీయుల ఆశయాలను నెరవేర్చడంలో ముందుంటుందని చెబుతూ ఘనంగా నివాళులర్పించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి గజ్జల తిరుపతి మౌర్య , జిల్లా అధ్యక్షులు కటికల ఓం ప్రకాష్ , జిల్లా కార్యదర్శి కొండనోళ్ళ నరేష్ , సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షులు ఉమేష్ , గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు కొమ్ము చంద్రం , గజ్వెల్ ఆశని కనక ప్రసాద్, కోడిసెల రవి ,నరేష్, సిద్దిపేట సంపత్,నాగరాజు, శంకర్ పలువురు పాల్గొన్నారు.
