Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 11 జనం న్యూస్ (జుక్కల్ నియోజకవర్గం రిపోర్టర్ లక్ష్మణ్)

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలో గావ్ చలో,బస్తి చలో అభియాన్ కార్యక్రమం బండరేంజల్ గ్రామంలో నిర్వహించడం జరిగింది బిచ్కుంద మండల అధ్యక్షులు శెట్పల్లి విష్ణు మాట్లాడుతు బం డరేంజల్ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది అదేవిధంగా మండల పరిధిలోని శక్తి కేంద్రాల ఇన్చార్జిలతో మరియు బూత్ కమిటీ కార్యకర్తలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి బండ రెంజల్ బూత్ లో ఉన్న దేవాలయాలను పరిశుభ్రత చేయాలని అంగన్వాడీలను విజిట్ చేయాలని పాఠశాలలను సందర్శించాలని బిజెపి సీనియర్ నాయకులను సన్మానం చేయాలని పలు కార్యక్రమాలను బూతు స్థాయిలో ప్రతి ఒక్క బూతు కమిటీ సభ్యులు నిర్వహించాలని ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అరుణతార, విశిష్ట అతిథిగా జైరాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు బిబి పటేల్ గారు గావ్ చలో బస్తీ చలో అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు, మరియు బండరింజల్ గ్రామ భూత అధ్యక్షులు గంగాధర్ పుండలిక్ తదితరులు పాల్గొన్నారు