

జనం న్యూస్ రిపోర్టర్ మండపేట నియోజకవర్గం (అంగర వెంకట్)
రాయవరం మండలం వెదురుపాక గ్రామంలో తూర్పు కాపుల కుల దైవం శ్రీ గౌరీ శంకరుల జాతర మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో గల కూటమి నాయకులు గౌరీ శంకర్లను దర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు. దర్శించిన వారిలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొవ్వూరి చంటి రెడ్డి ,వడ్డాది వెంకట కృష్ణంరాజు(పండు), కొవ్వూరి నాగిరెడ్డి,సత్తి శ్రీనివాస రెడ్డి, కటారి రామకృష్ణ, కోటిన సత్తిబాబు, తుంపాల లోవ రాజు, గోకాడ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.