Listen to this article

జనం న్యూస్ కాట్రేనికోన ఏప్రిల్11

కాట్రేనికోన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయితాబత్తుల పండుబాబు ఆధ్వర్యంలో కాట్రేనికోన గేట్ సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర మహాత్మా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిధిగా ముమ్మిడివరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలేపు ధర్మ రావు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే గొప్ప విద్యావేత్త అని, సామాజిక సంస్కర్త అని, అంటరానితనం పై, కులవ్యవస్థ పై పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ముఖ్యంగా అణగారిన మహిళల కోసం, స్త్రీ విద్య కోసం పాటు పడిన గొప్ప నేత అని కొనియాడారు. ప్రతి స్త్రీ తన కుటుంబ సభ్యులకు విద్యను నేర్పించిననాడే ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొన్నారు. ఆయన భార్యను మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలి గా చేసి స్త్రీ ల విద్య కోసం పాటు పడిన గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆయన అన్నారు .ఈ కార్యక్రమం లో సంగాని నాగరాజు, అర్ధని నాగరాజు,మల్లాడి గోపి,కముజు రాంబాబు,ఆటో యూనియన్ సభ్యులు కాశి సురేష్,నేలపాటి సురేష్, గజినీ, రాముడు తదితరనాయకులు పాల్గొన్నారు.