Listen to this article

జనం న్యూస్ బద్రి… గురజాల జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కటకం.అంకారావు
కారంపూడి మండలం పెద్దకొదమగుండ్లలో జనసేన నాయకులు మాడ.రామకృష్ణ మొక్కజొన్న పంటను కొంతమంది దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలుసుకొని ఫోన్ లొ మాడ రామకృష్ణతో మాట్లాడిన గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కటికం అంకారావు …
ఈ సందర్భంగా అంకారావు మాట్లాడుతూ, కొంతమంది గుర్తు తెలియని దుండగులు మొక్కజొన్న పంటను నాశనం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని,ఆయన అన్నారు.బాధితుడికి పార్టీ తరపున అండగా ఉంటామని ఆయన తెలియజేశారు.జరిగిన సంఘటన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన తెలిపారు.పోలీసు వారు యుద్ధ ప్రాతిపదికన కేసును దర్యాప్తు చేసి,మొక్కజొన్న పంటను నాశనం చేసిన దుండగులను గుర్తించి,చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు…!