Listen to this article

జనం న్యూస్:13 ఏప్రిల్ ఆదివారం; సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్;

హైదరాబాద్ భీరంగూడకు చెందిన పి.వి.భైరవన్ శర్మ తెలుగు పండితుడు.కవి.రచయిత. గాయకుడు. చిత్రకారుడు. రెండు వేలకుపైగా కవితలు.పాటలు.పద్యాలు రచించాడు. ఆరచనలను పుసకరూపములో ముద్రించి సుమారు 16పుస్తకాలు రచించాడు.అందులో మాట శతకం. ఆణిముత్యాలు. రామాయణం.అనే పద్యకావ్యాలు రచించాడు. తన లచనారంగంలో రమణాచారి దగ్గర మన్ననలు పోందాడు.రచనలే కాకుండా నాయకుడిగా కొనసాగుతూ దూరదర్శన్ టి.వి.లో ఈ టి.విలో అనేక పాటలు పాడి ఎన్నో ఉన్నత పురస్కారాలు అందుకున్నారు.చిత్రలేఖనం లోకూడా తనవంతు శైలితోఅనేక చిత్రాలు చిత్రించారు.చిత్రలేఖనంలో జాతీయస్థాయిలో జూరీ అవార్డును అందుకున్నారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంస్థనుండి ఉత్తము కవితా పురస్కారం అందుకున్నారు. తినే స్వియ రఛనలు చేసి తానే ఎంతోమధురంగా పాడటం భైరవన్ శర్మ ప్రత్యేకం ఎన్నో స్టేజీషోలలో పాడి ఎన్నో అవార్డులు. ఎందరో ప్రశంసలు పొందారు..ఈవే కాకుండా సుద్దముక్కలతో చెస్ కైన్స్ తయారుచేశాడు. రాగి ఆకుపైన చిత్రాలు వేయడంలో భైరవన్ శర్మ ప్రత్యేకత. ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో నిష్నాతుడు పి.వి.భైరవన్ శర్మ. చీపురు పుల్లలతో చార్ మినార్ తయారుచేసి అందరిచేత శెభాష్ అనిపించుకుని. సినిమా హాస్యనటుడు బాబు మోహన్ చేత ఎన్నో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. తన సాహిత్యసేవలో నిత్యం కొనసాగుతూ మాజీ స్పీకర్ మంత్రివర్యుల చేతులమీదిగి సన్మానాలు అందుకున్నారు.పి.వి.భైరవన్ శర్మ గారు సకల కళలలో ఆరితేరి తన ప్రయాణం ఇలానే కొనసాగించి. మునుముందు ఎన్నో పురస్కారం లు అందుకోవిలని కోరుకుంటున్నాము.