

జనం న్యూస్ జనవరి16 అచ్చంపేట నియోజకవర్గం ప్రతినిధి
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో పోస్టల్ సూపర్డెంట్ వనపర్తి భూమన్న గారి ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ IPPB మేనేజర్ ఎస్ ఎస్ వి జడ్చర్ల సబ్ డివిజన్ అసిస్టెంట్ సూపర్డెంట్ రవికుమార్ వంగూర్ సబ్ పోస్ట్ మాస్టర్ శివ కుమార్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్లు కలిసి వంగూరు గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో భాగంగా ఎస్పీ భూమన్న మాట్లాడుతూ ప్రతి ఇంటిలో ఒక పాలసీ తీసుకోవడం మంచిదని సూచించారు ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు యువకులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు యువకులు పాల్గొన్నారు