

టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు)..
జనం న్యూస్ // ఏప్రిల్ // 13 // కుమార్ యాదవ్ // జమ్మికుంట)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ ఉమ్మడి గురుకులాల నాలుగో తరగతి ప్రవేశ పరీక్ష నిర్వహించి వాటి ఫలితాల ఇటీవల ఆన్ లైన్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
అట్టి పరీక్షలు సీటు సాధించిన విద్యార్థులు ఈనెల 20 వరకు గడువు ఉన్నందున సీటు సాధించిన విద్యార్థిని, విద్యార్థులు సకాలంలో కేటాయించిన గురుకులాల్లో, అడ్మిషన్ పొందాలని, టి జి పి ఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ (ప్రభు) కోరారు. సీటు సాధించిన విద్యార్థినీ విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, నాలుగో తరగతి వరకు చదివిన పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టి సి) ,
ఆధార్ కార్డు తదితర ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని తీసుకువెళ్లి అడ్మిషన్ పొందాలని పిలుపునిచ్చారు.
ఆయా గురుకులాలలో సీటు పొందిన విద్యార్థుల విద్యార్థులు సకాలంలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కాని ఎడల, సీటును రద్దు చేయబడుతుందని, అట్టి సువర్ణ అవకాశాన్ని సద్వివియోగం చేసుకోవాలని తెలియజేశారు. అడ్మిషన్ పొందిన విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం విశాలమైన వసతులు,
నాణ్యమైన విద్య , మెరుగైన ఉచిత వైద్య, రెండు స్కూలు యూనిఫామ్ లు, ఒక పిఈటి డ్రెస్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, కాస్మటిక్ చార్జెస్, ఇస్తూ ఒక్కొక్క విద్యార్థినీ విద్యార్థిపై సంవత్సరానికి సుమారు,ఒక లక్ష యాభై వేల రూపాయలు, తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలియజేశారు.