

జనం న్యూస్ 13 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
నెల్లిమర్ల CKM ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని బర్ల లలిత ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. నిరుపేద కుటుంబానికి చెందిన లలిత సీనియర్ బైపీసీలో 989 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. గతేడాది ఫస్టియర్ ఫలితాల్లో లలిత జిల్లాలో మొదటి ర్యాంకు సాధించింది. మన్యం జిల్లా చినమేరంగి గ్రామానికి చెందిన లలిత తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ప్రిన్సిపల్ సత్యనారాయణ, అధ్యాపకులు అభినందించారు.