

జనంన్యూస్. 13. సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని రావుట్ల గ్రామంలో .ప్రజలు ఎదుర్కోంటున్న సమస్యలపై ఐక్యంగా కృషి చెద్దాం.గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ఐక్యంగా పనిచేద్దాం సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకులు, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఈ రమేష్ లు పేర్కొన్నారు ఆదివారం నాడు సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ రావుట్ల గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలోని పాత గ్రామపంచాయతీ వద్ద ప్రజల దాహార్థి తీరచ్చడానికి “చలివేంద్రం” ను ఏర్పాటు చేశారు. ఇట్టి చలివేంద్రంను సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకులు, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) సీనియర్ నాయకులు, ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఈ రమేష్ మాట్లాడుతు. గ్రామఅభివృద్ధిలో, గ్రామ ప్రజలసమస్యలను పరిష్కరించడం కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేద్దాం అన్నారు. రావుట్ల మండలంలోనే అన్నీ పక్షాలు కలిసి అభివృద్ధికి పాటుపడడం మంచి సంప్రదాయం అన్నారు. ప్రజల కోసం పనిచేసిన వ్యక్తులు ఎప్పటికి ప్రజల మన్ననలు పొందుతారు అన్నారు. ప్రజలకు నిష్పాక్షపాతంగా పని చేసి పాటుపడ్డ నాయకుడే సమాజంలో ప్రజల ఆమోదం కలిగి నిలబెడ్తారన్నారు. గ్రామం లోని అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా నిలబడి తమ సమస్యలను పరిష్కారించె దిశగా నిలబడాలన్నారు.
కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా)పార్టీ మండల నాయకులు ఈ.జమున,ఎం.శ్యామల, ఎస్. కే.తస్లిం, బట్టు. మంజుల, టి.చిన్నరాజన్న, బట్టు. సర్పంచ్, భాశెట్టి. గంగన్న, రావుట్ల సర్పంచ్ తోట. రాజన్న, విడిసి చైర్మన్ కోడిగేల. నందు, కాంగ్రెస్ నాయకులు సీచ్. రమేష్ గౌడ్, గొల్ల. శ్రీనివాస్, వార్డు మెంబెర్, కాంగ్రెస్ నాయకులు ఆర్. సామెల్, భాశెట్టి. దాస్, డాక్టర్. గోపాల్ గౌడ్, డాక్టర్. రమేష్, ప్యాట్ల. గంగాదాస్, బట్టు. రాజేందర్, బియ్యకర్. మోతిలాల్, కుమ్మరి. గంగు, కారోబార్ రాజబాపు, ఇట్టాంపేట. రాజేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.