Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

పట్టణములోని ఏఎంజి చెక్ పోస్ట్ సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా మాచర్ల యేసు అలియాస్ వేణు అనే బైక్ల దొంగని శుక్రవారం అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ పి.రమేశ్ చెప్పారు. ఆయన మాట్లాడుతూ అతని వద్ద నుంచి 17 బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతను 3ఏళ్లుగా చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. అతనిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై డి.చెన్నకేశవులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.