

భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహిత రామకోటి రామరాజు
జనం న్యూస్, ఏప్రిల్ 13 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శనివారం నాడు వీర హనుమాన్ విజయోత్సవ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ ర్యాలీలో భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత, శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాషాయం హిందువుల గుండెకాయ అన్నారు. ప్రతి హిందూ బంధువు పాల్గొని జై శ్రీరాం, జై హనుమాన్, జై శివాజీ అనే నినాదాలు గల్లీ గల్లీలో మారు మ్రోగాయన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి వ్యక్తి పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారన్నారు.