

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 13 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
ముఖ్యఅతిథిగా భారత దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్. వి. రమణ
ఎన్.వి. రమణ చేతుల మీదుగా ఈ అవార్డులందుకోవటం చాలా గర్వంగా ఉంది… జర్నలిస్టులు.
చిలకలూరిపేట :విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు మేడవరపు రంగనాయకుల ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారత దేశ అత్యున్నతమైన న్యాయస్థాన విశ్రాంత న్యాయమూర్తి ఎన్.వి. రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన జర్నలిజం లో వివిధ రంగాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినటువంటి జర్నలిస్టులకు అవార్డు ప్రధానం చేశారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు అనేవాళ్ళు సమాజంలో పట్టుకొమ్మలాంటి వాళ్ళని , జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధి లాగా పనిచేసి ప్రజల సమస్యలను ప్రభుత్వాలు దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను త్వరత గతిన పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోయే ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నటువంటి వారని జర్నలిస్టులు సమాజంలో ఉన్నటువంటి ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ వారి వారి కుటుంబాలకు కూడా దూరంగా ఉంటూ సమస్యలపై ప్రభుత్వాలు స్పందించే విధంగా కృషి చేసేవారని అలాంటివారికి అవార్డు ప్రధానం చేయడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవార్డులు అందుకున్నటువంటి పలువురు జర్నలిస్టులు మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా అవార్డులు అందుకోవడం చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా చిలకలూరిపేట నుంచి తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం జర్నలిస్టులు త్రికోటేశ్వర స్వామి చిత్రపటాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి.రమణకి బహుకరించడం జరిగింది. దానిపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. చిలకలూరిపేట జర్నలిస్టు నాయకులు ఎన్.వి రమణ కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.