

జనం న్యూస్ జనవరి 16 నడిగూడెం
ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం చేయాలని వ్యవసాయ సామాజిక కార్యకర్త మొలుగూరి గోపయ్య (గోపి ) రైతులను కోరారు. గురువారం రత్నవరంలో నిర్వహించిన గుడ్ మార్నింగ్ ఫార్మర్ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుత సీజన్లో ఒక మడి లేదా అర ఎకరంలో ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా సహజ సిద్ద పద్ధతులను పాటించి సాగు చేపట్టాలని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మనతో పాటు మన భవిష్యత్ తరాలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేయాలన్నారు. నేల ఆరోగ్యమే పంట ఆరోగ్యం అని పంట ఆరోగ్యమే మన ఆరోగ్యం అని రైతులకు అవగాహన కల్పించారు.