

తెలుగుదేశం పార్టీలో కష్టపడే ముస్లిం మైనార్టీలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని రాష్ట్ర రోడ్డు రవాణా భవనాల శాఖ మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు, శనివారము రాజంపేట స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశం అనంతరం ముస్లిం మైనార్టీ నందలూరు మండల టిడిపి నాయకులు షేక్ మౌల పఠాన్ మెహర్ ఖాన్ షేక్ షర్మిల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి సమక్షంలో ఆయనను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చమిచ్చి సత్కరించడం జరిగినది. అనంతరం నందలూరు మండలంలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగినది. అదేవిధంగా తమకు పార్టీలో గౌరవపదమైన ప్రత్యేక స్థానం కల్పించాలని కోరడం జరిగినది. అందుకు ఆయన సానుకూలంగా స్పందించి తాను వంతు సహాయ సహకారాలు అందిస్తామని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.
