Listen to this article

జనం న్యూస్ జనవరి 16 వాంకిడి మండల కేంద్రం లో
జరుగుతున్న ఇందిరమ్మ ఇంటింటి సర్వే కాంగ్రెస్ పార్టీ వాంకిడి మండల యువజన ఉప అధ్యక్షులు కిషన్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జాగ్రత్తగా ప్రతి ఒక్కరి వివరాలు నమోదు చేయాలని ప్రభుత్వ పథకాలకు అర్హులైన ఏ ఒక్కరికి నష్టం జరగకూడదు అన్నారు అలాగే త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుభరోసా ఇందిరమ్మఇండ్లు రేషన్ కార్డుల ప్రక్రియ తదితర పథకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ సర్వే కొనసాగించాలన్నారు అలాగే మండల గ్రామ కార్యకర్తలు కూడా వారివారి పరిధిలో జరుగుతున్న సర్వేలలో పాల్గొని ప్రజలకు ఇబ్బంది లేకుండా సహాయ సహకారాలు అందించాలని సూచించారు..ఈ కార్యక్రమం గ్రామపంచాయతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు