Listen to this article

సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం

జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్తి పన్ను, కరెంట్ బిల్లుతో పాటు వంట గ్యాస్ పై 50 రూపాయలు ధర పెంచి పేద, మధ్యతరగతి ప్రజల నెత్తిన మోడీ గుదిబండ మోపుతున్నా కనీసం చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ లు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు అని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం జంక్షన్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర గ్యాస్ బండలు మహిళలు నెత్తిన పెట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాలో మాట్లాడుతూ అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వాల దెబ్బకు ప్రజల జీవన విధానం కుదేలై అత్యంత ప్రమాదంలో పడిందని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు ఉచిత గ్యాస్ అనే పేరుతో ప్రచారార్బాటాలు నిర్వహించి ఎన్నికల్లో నెగ్గి గద్దెనెక్కిన తర్వాత తెప్ప తగలేశారని దుయ్యబట్టారు. శ్రీరామనవమి పండగ కానుకగా వంట గ్యాస్ పై 50 రూపాయలు పెంచి ప్రజలపై అధిక బారాలు మోపారని విమర్శించారు. ఇప్పటికే ఈ 10 నెలల కాలంలో విద్యుత్ చార్జీలు, వైద్య మందుల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఆస్తి పన్ను పెంపు, నిత్యవసర వస్తువుల ధరల పెంపు విపరీతంగా పెంచి ప్రజల రక్త మాంశాలతో ప్రభుత్వాలను నడుపుతార అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు బాదుడే బాధడంటూ గొంతు చించుకుని అరచిన మీ నోళ్ళు ఇప్పుడెందుకు పెగడలడం లేదని ప్రశ్నించారు. గ్యాస్ బండ పెంపుతో పాటు పట్టణాల్లో పెంచిన ఆస్తి పన్నులతో ప్రజల సతమతం అవుతున్నారని అన్నారు. ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతున్న ఇక్కడ మాత్రం అధిక ధరలు పెంచడం సిగ్గుచేటు అని వారు విమర్శించారు. వెంటనే ఎక్సైజ్ సుంకం రద్దు చేయాలని వారు కోరారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించకపోతే ప్రజల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఊసరవెల్లిలా రోజుకో మాటలు మారుస్తూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇలాంటి పాలకుల విధానాలుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.రంగరాజు, మార్క్స్ నగర్ శాఖ సహాయ కార్యదర్శి బూర వాసు, బల్జివీధి శాఖ కార్యదర్శి పొందూరు అప్పలరాజు, శాంతి నగర్ శాఖ నాయకులు సూరిడమ్మ మరియు మహిళలు హజరయ్యారు.