

జనం న్యూస్ 14 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్ టౌన్ CI ఎస్ శ్రీనివాసరావు కోరారు. ఆదివారం సాయంత్రం రైల్వే స్టేషన్ సమీపంలోని వసంత విహార్ రెసిడెన్సిలో నివాసం ఉంటున్న ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. సమాజంలో ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న నేరాలు, దొంగతనాలు పట్ల ఆయన అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు విధిగా పాటించాలని కోరారు. SI లు అప్పారావు, రామ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.