

జనం న్యూస్ //జనవరి 16//జమ్మికుంట //కుమార్ యాదవ్..
కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా వరుకుటి మదన్ రావు ఎంపికయ్యారు.కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ చేతుల మీదుగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామ నివాసి అయిన కాంగ్రెస్ నాయకుడు వరుకూటి మదన్ రావును కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ రావు,ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్, మరియు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఓడితల ప్రణవ్ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందించడం జరిగింది,అన్నారు.ఇ సందర్బంగా మదన్ రావు మాట్లాడుతు.. నామీద నమ్మకం తో కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ గా నియమించినందుకు, కృతజ్ఞతలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ కోసం కస్టపడి పని చేస్తన్నన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను అని వివరించారు.