

ముఖ్య అతిథులుగా హాజరైన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ నాగుర్ల వెంకన్న బాల మల్లు..
జనం న్యూస్ 14 ఏప్రిల్ 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్.)
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద మరియు చింతలపల్లి వద్ద బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభ స్థలంలో భారత రాజ్యాంగ నిర్మాత బహు ప్రజ్ఞాశాలి విద్యావేత్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పూలదండ వేసి నివాళులు అర్పించిన హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వోడితల సతీష్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని నిర్మించడం ద్వారా సమాజాభివృద్ధి చట్టాల ద్వారా కుల వివక్ష లేకుండా రాజ్యాంగంలో దేశ అభివృద్ధి కోసం అనేక చట్టాలను పొందుపరిచారని అన్నారు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ అనంతరం ఆయన ఆశయ సాధన కోసం పనిచేశామన్నారు గతంలో కంటే దినదినాభివృద్ధి చెందింది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పిట్టల మహేందర్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ శేషగిరి, మాజీ వైస్ ఎంపీపీ తంగేడ నగేష్, రైల్వే బోర్డు సభ్యులు యేల్తూరీ స్వామి,మాజీ ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు కడారి రాజు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ తంగెడ మహేందర్, మండల యూత్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, సోషల్ మీడియా మండల అధ్యక్షులు గుండేటి సతీష్ నేత, మైనారిటీ సెల్ అధ్యక్షులు మధార్, మండల ప్రధాన కార్యదర్శి జూపాక జడ్సన్,వోడితల యువసేన అధ్యక్షులు చిట్టి గౌడ్, మండల సీనియర్ నాయకులు దుగ్యాని సమ్మయ్య, వేముల సమ్మయ్య, చదిరం నాగేశ్వర్, కుర్ర సాంబమూర్తి గౌడ్, అల్లకొండ రాజు, అంబాల రాజ్ కుమార్, కోరే రాజ్ కుమార్, డెంగు రమేష్,రాజేశ్వరరావు, శివాజీ, సతీష్, మాజీ ఉపసర్పంచ్ ప్రహ్లాద రావు,రాజేశ్వర్ రావు, ఉట్కూరి కార్తీక్, యూత్ నాయకులు శ్రీకాంత్ యాదవ్, బొంకూరి కార్తీక్, తక్కలపల్లి వినయ్ రావు, భగవాన్ గౌడ్,అనిల్, తదితరులు పాల్గొన్నారు