

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 14 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
పట్టణంలోని మేకల వెంకయ్య సీతాఫలాల తోటలో “హ్యాపీ బాయ్స్”ఆధ్వర్యంలో మద్దిబోయిన కిషోర్ 32వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో హ్యాపీ బాయ్స్ మద్దిబోయిన కిషోర్ చేత కేక్ కటింగ్ చేయించి ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మరింత అభివృద్ధి పథంలోకి నడవాలని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మద్దిబోయిన కిషోర్ మాట్లాడుతూ తన పుట్టినరోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకయ్య, మద్ది బోయిన.శేఖర్, తన్నీరు వంశీ, కొండా పవన్, మంగు సాయి, పుట్టా వెంకట బుల్లోడు,మరియు కుప్పన బోయిన తిరపతి స్వామి పాల్గొన్నారు.