

జనం న్యూస్ ఏప్రిల్ 14 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ)
ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముమ్మిడివరం నగర పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి గోపి అధ్యక్షతన జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు , అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ఈ కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు, ఆయన పుట్టినరోజు పురస్కరించుకొని భారీ కేక్ నాయకులు, కార్యకర్తలు మధ్య భారీ కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో బుచ్చిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ సేవలు ఈ దేశానికి ఎంతో అవసరం అయినాయని వాటి ద్వారా స్త్రీకి స్వేచ్ఛ సమానత్వం హక్కులను రాజ్యాంగంలో పొందుపరిచారని పేదలు అంబేద్కర్ ని దైవంతో సమానంగా పూజిస్తారని జయంతి సభలో బుచ్చిబాబు మాట్లాడారు. మరియొక అతిధి అమలాపురం పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో అంబేద్కర్ ఒక దిక్సూచి లా కొనియాడ పడుతున్నారని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గా పిలుస్తారని అన్నారు అంబేద్కర్ చేసిన కృషికి ప్రపంచ దేశాలు ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డే గా ప్రకటించారని హరీష్ కొనియాడారు. అలాగే పోలమ్మ చెరువు గట్టున గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిలువెత్తు శిలా విగ్రహానికి శాసనసభ్యులు దాట్ల బుచ్చిబాబు పార్లమెంటు సభ్యులు గంటి హరీష్ మాధుర్ పూలమాలల వేసి ఘనమైన జయంతి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు,ముమ్మిడివరం నియోజకవర్గ యువ నాయకులు దాట్ల పృథ్వీరాజ్, గొల కోటి దొరబాబు, తాడి నరసింహారావు, దొమ్మేటి రమణ కుమార్, ములపర్తి బాలకృష్ణ, కట్టా సత్తిబాబు, మాదాల బుజ్జి, వీళ్ళ వీరస్వామి నాయుడు, చిక్కాల అంజిబాబు, కుంచనపల్లి నారాయణరావు, యాళ్ల ఉదయ్, పాయసం చిన్ని,నిమ్మకాయల విషు, గోదాసి గణేష్, కాకి మాణిక్యం, కర్రి శ్రీను, కాశి లాజర్, జనపల్లి సత్యనారాయణ, కుంచె శ్రీను, దంగేటి శ్రీను,మెండి కమల, వాసంశెట్టి అమ్మాజీ, కుడిపూడి మల్లేశ్వరి, పెదపూడి రుక్మిణి, ముమ్మిడివరపు వరలక్ష్మి, బిజెపి మహిళ, రెడ్డి శ్రీను, రెడ్డి సుబ్బారావు, సానబోయిన చంటి బొక్క కృష్ణ దొమ్మేటి దుర్గారావు, బూరుగు కళ్యాణ్, నీతిపూడి వంశీ, చింతలపూడి బాబురావు, కటికదల నాని, తోత్తరమూడి జ్యోతి బాబు, సత్తి నూకరాజు, మట్ట సత్తిబాబు, సెట్, ఏడిది శివ, సాన బోయిన లక్ష్మీనారాయణ, మొదలగు వారు పాల్గొన్నారు.
