Listen to this article

బిచ్కుంద ఏప్రిల్ 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయన చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగాధర్, సీనియర్ నాయకులు మల్లికార్జున్ అప్ప, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాయిని అశోక్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, సాయిని బస్వరాజ్, మాజీ ఉపసర్పంచ్ నాగరాజ్, గౌస్ సెట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.