Listen to this article

జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ సోమవారం నుంచి అమలు కానుంది దాదాపు ముప్పై ఏళ్ల పాటు వర్గీకరణ కోసం జరిగిన పోరాటానికి ప్రతిఫలంగా దీని అమల్లోకి తీసుకువ స్తూ ఉత్తర్వులు నిబంధ నలు జారీ కానున్నాయి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి రోజు న వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది, ఎస్సీ ఉప కులాల దశాబ్దాల కళ ఎట్టకేలకు నెరవేరింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీనితో ఎస్సి ఉప కులాలకు పది హేను శాతం రిజర్వేషన్లు అధికారికంగా అమలుకు రానున్నాయి, ఎస్సీల్లో ఉన్న మొత్తం యబై ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించి కేటాయింపులు చేశారు. సామాజిక రంగ విద్యాపరంగా ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వారిలో పది హేను ఉపకులాలు ఉన్నాయని గుర్తించి గ్రూపు ఒకటి కింద ఒక శాతం, మద్యస్థంగా లబ్ధి పొందిన పద్దెనిమిది ఉపకులాలకు గ్రూప్ రెండు కింద తొమ్మిది శాతము గణనీయంగా లబ్ధి పొందిన ఇరవై ఆరు ఉప కులాలను గ్రూప్ ముడు కింద ఐదు శాతం రిజర్వేషన్లు ప్రభుత్వం కేటాయించింది..
అంతకంటే ముందు ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం సచివాలయంలో భేటీ అవుతుంది. ఉత్తర్వులను విడుదల చేసిన అనంతరం మంత్రులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసానికి వెళ్లి.. ఎస్సీ రిజర్వేషన్ల అమలు జీవో తొలి కాపీని అందిస్తారు. జీవో అమల్లోకి వచ్చినప్పటి నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రకటనలు, విద్యా సంస్థల ప్రవేశాలకు వర్గీకరణ వరిస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దేశంలో ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం గమనార్హం.