

జనం న్యూస్,ఏప్రిల్14
అచ్యుతాపురం:భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈలు ఎం శ్రీనివాసరావు,నాగరాజు అద్వర్యంలో అచ్యుతాపురం విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్ తరాలు భూమిపై మనుగడ సాగించాలంటే… ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.