

పేద వర్గాలకు అండగా నిలబడిన డా. బి అర్ అంబేద్కర్..
ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్వక్తి..
కాంగ్రెస్ నాయకులు అజయ్ కుమార్..
జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్,// జమ్మికుంట )..
జమ్మికుంట మండలం ధర్మారం గ్రామంలో, మారపల్లి అజయ్ కుమార్, ఆధ్వర్యంలో ఘనంగా, డాక్టర్. బి అర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిపారు. భారత రాజ్యాంగ రూపకర్త, జాతీయవాది, న్యాయకొవిదులు, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి సందర్భంగా, ధర్మారం లో అంబేద్కర్ విగ్రహానికి, గ్రామ నాయకులు, ప్రజలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అజయ్ మారియు శ్రీకాంత్ రెడ్డి, ఆంజన్నా, మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు ఆర్థిక, సామాజిక న్యాయ రాజకీయ రంగాల్లో సమన్యాయం ఉండాలని ఆకాంక్షించి , భావి తరాల భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, అతి పెద్ద రాజ్యాంగాన్ని రచించిన, భారత రత్న డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ అని అన్నారు.
అంబేద్కర్, ఒకవర్గానికి చెందిన వారు కాదని, ఈ సమాజంలోని ప్రజలందరి వాడని, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి, అని ప్రజల హక్కుల కాపాడిన మహోన్నత వ్యక్తి, అని తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ది, కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, అని అన్నారు. జాతీయ ఉద్యమంలో, అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటినుంచి సమాజంలోని కొంత, ఎన్నో అవమానాలు ఎదురైన వెను దిరగక, వాటిని దైర్యంగా ఎదుర్కొన్నారన్నారు. 32 డిగ్రీలు పొంది,డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడిగా నిలిచారన్నారు. విద్యాభ్యాసం తరువాత ఆర్థిక వేత్తగా ప్రొఫెసర్ గా, న్యాయవాదిగా పలు పాత్రలు పోసించారన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆనాటి సామాజిక వర్గాల పరిస్థితుల నేపథ్యంలో అట్టడుగున ఉన్న దళిత గిరిజన వర్గాల అభ్యున్నతికి విద్యా, ఉద్యోగ, రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని, అంబేద్కర్ సూచనలతో కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించడం, తో దళిత గిరిజన ప్రజల జీవితాల్లో వెలుగులు నింపయన్నారు.అంబేద్కర్ జయంతి రోజే, ఎస్సీ ఉపకులాలవారికి వర్గీకరణ చట్టం అమలుకు నేడే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వుల విడుదల చేయడం హర్షణీయమన్నారు.
జమ్మికుంట మండలంలో ధర్మారం చౌరస్తా లో, అంబేద్కర్ జయంతి వేడుకలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇ కార్యక్రమంలో.. గ్రామ నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
