Listen to this article

బియ్యం గింజలతో అంబేద్కర్ అద్భుతం

జనం న్యూస్, ఏప్రిల్ 15 ( తెలంగాణ స్టేట్ ఇన్చార్జ్ ములుగు విజయ్ కుమార్ )

అంబేద్కర్ 134 వ జయంతిని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు బియ్యం గింజలను ఉపయోగించి అద్భుతంగా అంబేద్కర్ చిత్రాన్ని చిత్రించి సోమవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి, అస్తిత్వ ఉద్యమాలకు దశదిశలను చూపిన స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అన్నారు. భారత ఔన్నత్యాన్ని, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వ వ్యాప్తం చేసిన మహోన్నత కీర్తి శిఖరం డాక్టర్ అంబేద్కర్ అన్నారు.