Listen to this article

జనం న్యూస్ // ఏప్రిల్ // 14 // కుమార్ యాదవ్ // జమ్మికుంట )..

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం లోని వినవాంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి కుమార్తె హర్షిత రెడ్డి ఇటీవల కాలంలో అమెరికాలో అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. అమెరికాలోనే ఆమె పార్థివ దేహాన్ని ఖననం చేశారు. కాగా పరిపాటి రవీందర్ రెడ్డి తన సొంత గ్రామమైన పోతిరెడ్డిపల్లి కి సోమవారం రావడం జరిగింది.శోక సముద్రం లో ఉన్న పరిపాటి రవీందర్ రెడ్డి ని వారి నివాసానికి వెళ్లి, జమ్మికుంట కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మరియు వినవంక మండలం నాయకులు, అభిమానులు పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.