

లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకుందా
జనం న్యూస్ ఏప్రిల్ 14 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
వాంకిడి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఆధ్వర్యంలో అంబేద్కర్ 134 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది మతోన్మాద శక్తుల నుండి లౌకిక భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడమే అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన వారము అవుతామని వారు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ రాజ్యాంగ మౌలిక సూత్రాలపై దాడి చేస్తున్నదని ఆరోపించారు .భారత రాజ్యాంగం స్థానంలో మనువాద రాజ్యాంగం తీసుకురావాలని కుట్ర చేస్తున్నదని దుయ్యబట్టారు. భారత రాజ్యాంగాన్ని కాపాడేందుకు మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప్రే ధర్మజీ మాలి మహా సంఘ జిల్లా అధ్యక్షులు మెంగజీ, ఓబీసీ సెల్ అధ్యక్షులు జబరే గణేష్,సమేల రమేష్, మండోకర్ దాదాజీ,సుజ్జు తదితరులు పాల్గొన్నారు