Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా నందలూరు మండలం నందు ప్రపంచ మేధావి భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి. 134 జయంతి వేడుకలు ఘనంగా జరగడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్కూల్ విద్యార్థులకు ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ గెలుపొందిన వారికి బహుమతులు ఇవ్వడం జరిగినది. మండలంలో బీదలకు మహిళలకు శారీలు అలానే పురుషులకు వస్త్రాలు( పంచలు) ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పులివెందల నియోజకవర్గం చైర్మన్ నేసే జాన్ పాల్. పొద్దుటూరు నియోజకవర్గ చైర్మన్, ఏ. ప్రతాప్ కుమార్. పులివెందుల మండల ఎస్ సి సెల్ చైర్మన్ ఎట్టి రామకృష్ణ. అలానే నందలూరు ప్రభుత్వ వైద్యాధికారి మరియు మండల రాజకీయ ప్రముఖులు పెద్దలు మహిళలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలను అద్భుతంగా జరిగించడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు తాళ్లూరి ప్రసన్నకుమార్ సార్ కి కడప అన్నమయ్య జిల్లాల ప్రతినిధులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్య విషయం ఏమనగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా నందలూరు మండలం లో స్వర్గీయ చదలవాడ ఉమేష్ చంద్ర ఐ పి ఎస్. జ్ఞాపకార్థకంగా ఫ్రీ స్టడీ సర్కిల్ బీద విద్యార్థులకు ఏర్పాటు చేయడం జరిగినది( హిందీ ప్రచార సభ హైదరాబాద్)