

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
జనం న్యూస్ 15 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం మహిళా పోలీసు స్టేషను డిఎస్పీగా ఆర్.గోవిందరావు ఏప్రిల్ 14న బాధ్యతలు స్వీకరించారు.
అనంతరం, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ను జిల్లా పోలీసు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి, పూల మొక్కను అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ డిఎస్పీ గోవిందరావును అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. మహిళల ఫిర్యాదుల పట్ల సానుకూలంగా వ్యవహరించాలని, ఫిర్యాదులు అందిన వెంటనే కేసులు నమోదు చేయాలని, శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజలకు, విద్యార్ధినులు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. ఆపద సమయంలో శక్తి మొబైల్ యాప్ వినియోగించి, ఏవిధంగా పోలీసుల సహాయం, రక్షణ పొందవచ్చునో ప్రజలకు వివరించాలని డిఎస్పీ ఆర్.గోవిందరావును జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. 1991వ సం.లో డైరెక్టు సబ్ ఇన్స్పెక్టరుగా పోలీసుశాఖలో ప్రవేశించిన ఆర్.గోవిందరావు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోను, విజయనగరం జిల్లాలో ఎన్.కోట, విజయనగరం రూరల్, భోగాపురం, వన్ టౌన్, డెంకాడ పోలీసు స్టేషనుల్లో ఎస్ఐ గాను, సిఐ గాను, డిఎస్పీగా మెరైన్, విజయనగరం డిఎస్పీ గాను గతంలో పని చేసారు. ఇటీవల డిఎస్పీల బదిలీల్లో విజయనగరం మహిళా పోలీసు స్టేషను డిఎస్పీగా ర్.గోవిందరావును నియమించడంతో, ఏప్రిల్ 14న విజయనగరం మహిళా పిఎస్ డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు.