

జనం న్యూస్ – ఏప్రిల్ 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక తేదీ 18- 5- 2025 న ఏఈ/ 77 ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నందు నిర్వహించనున్నట్లు ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ పిల్లి శ్రీనివాస్ తెలిపారు, కావున నాగార్జునసాగర్ పైలాన్, హిల్ కాలనీ షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్సీ) ఎంప్లాయిస్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడంలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అలుపూరి శ్రీనివాస్, ట్రెజరర్ రాజా తదితరులు పాల్గొన్నారు.