

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం..
జనం న్యూస్ // ఏప్రిల్ // 15 // కుమార్ యాదవ్ // జమ్మికుంట..
జమ్మికుంట మండలం లోని మడిపల్లి గ్రామంలో అంబాల సుమలత శ్రీనివాస్, దంపతుల ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మంగళవారం నాడు ముఖ్య అతిథిగా హాజరైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం ప్రారంభించారు.ఈ సందర్భంగా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం మాట్లాడుతూ..బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమంలో భాగంగా మడిపల్లి గ్రామ ప్రజలతో పాటు ఆ ఊరు మీదిగా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రజల దాహార్తి తీర్చేందుకు బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ మహిళలు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఇలాంటి సేవ భావాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని తెలిపారు. ఈ వేసవి సీజన్ లో గ్రామ గ్రామాన చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అన్నారు. అనంతరం బాలవికాస స్వచ్ఛంద సేవ సంస్థ జమ్మికుంట సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ పుల్లూరి స్వప్న సదానందం తోపాటు చలివేంద్రం ఏర్పాటు చేసిన దాత అంబాల సుమలత లను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండల ప్రజా పరిషత్ మాజీ అధ్యక్షులు నేరెళ్ల రాజమల్లు గౌడ్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎగ్గేటి సదానందం, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ఉప్పల సాంబశివరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంబాల రాజు, కాంగ్రెస్ పార్టీ మడిపల్లి గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మంగ అశోక్, తాళ్లపల్లి అంజి, బాల వికాస స్వచ్ఛంద సేవ సంస్థ కోఆర్డినేటర్స్ అగ్గి స్వాతి, మహమ్మద్ ఆసియా బాలవికాస మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.