

యువతరం నవతరం కలయికలో స్వాతంత్ర స్ఫూర్తితో సమాజ మార్పు కోసం మరో పోరాటం చేద్దాం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలో యువతకు ఇచ్చిన డిక్లరేషన్ అమలు చేయాలి
సామాజిక న్యాయం సాంప్రదాయ జానపద శాస్త్రీయ సాంస్కృతిక కళలు మహనీయుల స్ఫూర్తి మార్పుకై యువతను ఐక్యం చేద్దాం
డివైఎఫ్.ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్
జనం న్యూస్ జనవరి 17 (వనపర్తి జిల్లా పానగల్ మండల ప్రతినిది కల్మూరి వెంకటేష్ )
వనపర్తి జిల్లా పానగల్ మండలం రేమద్దుల గ్రామంలో సంక్రాంతి పండుగా సందర్భంగా క్రీడలను ప్రారంభించారు
క్రీడల ముగింపు సందర్భంగా బహిరంగ నిర్వహించారు ఈ సభలో డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రేమద్దుల గ్రామంలో గత 47 సంవత్సరాల నుంచి సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలను నిర్వహిస్తూ యువతి యువకుల ఐక్యత కోసం సమాజం చదువు ఉపాధి మార్పు లక్ష్యాలతో విద్యార్థి యువజన సంఘం కలయికలో క్రీడాకారులను ప్రోత్సహించడానికి క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు, పార్లమెంటు, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువత డిక్లరేషన్ ప్రధానంగా విద్యా ఉపాధి క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని క్రీడాకారులకు గుర్తింపునిస్తూ తగిన ప్రాధాన్యత కల్పిస్తామని ప్రతి సంవత్సరం యువత కోసం రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీలు అమలు కాక యువతను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు రాబోయే కాలంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో యువత విద్యా ఉపాధి క్రీడారంగా అభివృద్ధి కోసం పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు ఎండి జబ్బార్ కిల్లె గోపాల్ మాట్లాడుతూ 1980వ సంవత్సరము రేమద్దుల లో డివైఎఫ్ఐ సంఘాన్ని ఏర్పాటు చేసి నిరక్షరాస్యులుగా ఉన్న యువతకు రాత్రిపూట బడులు అక్షరాస్యత ద్వారా చదువు నేర్పిస్తూ దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలిన భగత్ సింగ్ రాజగురు శుక్ దేవ్ చంద్రశేఖర్ ఆజాద్ అల్లూరి సీతారామరాజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి మహనీయుల ఆలోచనలతో డివైఎఫ్ఐ సంఘాన్ని ఏర్పాటుచేసి విద్య ఉపాధి ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమాలు కొనసాగిస్తున్నామని అన్నారు దేశవ్యాప్తంగా మహనీయుల స్ఫూర్తితో నడుస్తున్న డివైఎఫ్ఐ సంఘం గ్రామాలలో పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారని అన్నారు రేమద్దుల గ్రామంలో పెండింగ్ లో ఉన్న హై స్కూల్ బిల్డింగు రోడ్లు సంక్షేమ పథకాల అమలుకై పోరాటాలు కొనసాగిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు డి బాల్ రెడ్డి, ఎం వేణుగోపాల్ ఏ లక్ష్మి కవిత గుంటి వెంకటయ్య భగత్ ఎం వెంకటయ్య జ. మల్లేష్ యం.డి ఖాజా డి. చంద్ర శేఖర్ ఆర్. నిరంజన్, కె వెంకటయ్య వి. భాస్కర్, నీలం అంజి బహుమతుల దాత మోటూరి శివయ్య మేస్త్రి గడ్డి గోపుల మహేష్ కమలాకర్ భాస్కర్ గౌడ్ జి మహేష్ బాలకిషన్ శివరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్ వెంకటేష్ ఎం బాలకృష్ణయ్య ఏ తిరుపతి రాములు కండక్టర్ కృష్ణయ్య ప్రజానాట్యమండలి కళాకారులు తదితరులు పాల్గొన్నారు