Listen to this article

వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి

ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం కల్పించాలి

మండల ప్రత్యేక అధికారి శిరీష

జనం న్యూస్ ఏప్రిల్ 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)

వేసవి కాలంలో నర్సరీలో మొక్కల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వేసవికాలం దృష్యా ఉదయం,సాయంత్రం మొక్కులకు నీరు పోయాలని నర్సరీల్లోని ప్రతి మొకనూ సంరక్షించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మంగళవారం రేపాల, నరసింహుల గూడెం గ్రామాల్లో నర్సరీలను సందర్శించి మాట్లాడారు ..మొక్కలకు ఎప్పటికప్పుడు నీళ్లు పోస్తూ ఏపుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. పిచ్చిమొక్కలు పెరిగితే వెంటనే తొలగించాలని, వాచర్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.నర్సరీల పై షెడ్‌నెట్లను మొక్కలకు గాలి తగిలేలా ఏర్పాటు చేయాలని సూచించారు. నరసింహులగూడెం గ్రామంలో ఉపాధి హామీ పని ప్రదేశాన్ని కూలీల హాజరు నమోదు మస్టర్ ను పరిశీలించారు, పని ప్రదేశంలో కూలీలకు వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు.ఈ కార్యక్రమంలో ఆమె వెంట మునగాల ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, ఏపీవో శైలజ, పంచాయతీ కార్యదర్శి బ్రహ్మారెడ్డి, నరసింహుల గూడెం ఎఫ్ ఏ కళ్యాణి, రేపాల ఎఫ్ ఏ సావిత్రి తదితరులు పాల్గొన్నారు.