

జనం న్యూస్ ఏప్రిల్ 25 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం జిల్లాలో బిసి హాస్టల్స్ లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల 12 నెలల పెండింగ్ వేతనాలు వేంటనే చెల్లించాలని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి, అనంతరం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దౌత్రే కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్బంగా డి. బ్రహ్మానందం, రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ….కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు గత 12 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు 30, 31 రోజులు కష్టపడి విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు వేతనాలు 12 నెలలు చెల్లించకుంటే వర్కర్స్ డ్యూటీ ఎలా చేస్తారు. ప్రతినెల నిత్య అవసర సరుకులు (కిరాణం), పాల బిల్లు, కరెంటు బిల్లు, డిష్ బిల్లు, ఇంటికి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, హాస్పిటల్ , తదితర ఖర్చులు ఎక్కడ నుండి డబ్బులు తీసుకొచ్చి బ్రతకాలి, కేవలం నెలకు 13600/- రూపాయలతో జీవిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు ప్రతినెల వేతనాలు చెల్లించకపోవడం అత్యంత బాధాకరం, అలాగే ఈ.ఎస్.ఐ. ఈ.పీ.ఎఫ్. ప్రతినెల చెల్లించడం లేదు. దీనివల్ల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పోస్ట్ మెట్రిక్ హాస్టలల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వర్కర్స్ అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురివుతున్నారు. కనుక ఇప్పటికైనా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ పోస్టు మెట్రిక్ హాస్టలలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ కు తక్షణమే 12 నెలల వేతనాలు చెల్లించాలని, లేని యెడల నిరవాదిక సమ్మెకు కూడా పిలుపు ఇవ్వాల్సి వస్తుందని భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐ ఎఫ్ టి యు) డిమాండ్ చేస్తూ, హెచ్చరిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో జగజంపుల తిరుపతి, పి డి ఎస్ యు జిల్లా ప్రధాన కార్యదర్శి, బీసీ హాస్టల్ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యు) నాయకులు కొమురయ్య, లక్ష్మి, శారద, పార్వతి, శకుంతల, పోషక్క, సరోజ, జ్యోతి, సుజాత మరియు తదితరులు పాల్గొన్నారు.డి బ్రహ్మానందం.(ఐ ఎఫ్ టి యు) భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర నాయకులు