

జనం న్యూస్, ఏప్రిల్15,అచ్యుతాపురం:
మండలం పేరుగాంచిన శ్రీ చోడమాంభిక అమ్మవారి పండగ సందర్భంగా మోసయ్య పేట శ్రీ యువశక్తి ఆటో యూనియన్ అసోసియేషన్ సీఐటీయూ అనుబంధం వారి ఆధ్వర్యంలో మోసయ్యపేట నుండి చోడపల్లి గుడికి వెళ్లే భక్తులకు పది ఆటోలను పెట్టి ఉచిత ప్రయాణం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మజ్జిగ కేంద్రాన్ని ప్రారంభించిన సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రాము మాట్లాడుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా స్నేహభావం పెంపొందుతుందని,ఆటో కార్మికులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కే.సోమునాయుడు ,శ్రీ యువశక్తి ఆటో యూనియన్ అధ్యక్షులు దమ్ము చండి, కార్యదర్శి పోలవరపు అప్పారావు, ఉపాధ్యక్షులు తట్టారాజు, కోశాధికారి ధర్మీరెడ్డి సన్నిబాబు,పోలావర్పు దుర్గా,మురళి,సూరిబాబు,అప్పారావు,చంటి తదితరులు పాల్గొన్నారు.